డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

కడప అర్బన్‌ : డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా కడప నగరంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’కార్యక్రమాన్ని జూన్‌ 26న (శుక్రవారం) సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’కార్యక్రమాలను చేపడుతూ, గంజాయి, డ్రగ్స్‌ వంటి నిషేధిత మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు, యువతకు వివరిస్తూ, అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలో సిగ్నేచర్‌ క్యాంపైన్‌తోపాటు వాకథాన్‌ అవేర్‌ నెస్‌ ర్యాలీని చేపట్టామన్నారు. విభిన్న ప్రతిభావంతుల, ట్రాన్స్‌జెండర్ల, సీనియర్‌ సిటిజెన్స్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.వి కృష్ణ కిషోర్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె.ప్రకాష్‌ బాబు, అడిషనల్‌ ఎస్‌.పి(ఏ.ఆర్‌) బి.రమణయ్య, డ్రగ్‌ కంట్రోల్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆశా, కడప ఇంచార్జ్‌ డి.ఎస్‌.పీ ఇ.బాలస్వామి రెడ్డి, ఏ.ఆర్‌ డి.ఎస్‌.పీ పి.నాగేశ్వర రావు, ఎకై ్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.చంద్రశేఖర్‌రెడ్డి, నార్కోటిక్స్‌ సి.ఐ గోవిందరెడ్డి, కడప నగరంలోని సి.ఐలు, ఎస్‌.ఐలు, మెప్మా, ఐ.సి.డి.ఎస్‌, డి.ఎం.హెచ్‌.ఓ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, డీ అడిక్షన్‌ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement