రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంటపంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికుల వివరాల మేరకు.. మంటపంపల్లికి చెందిన వేంపల్లి అబ్దుల్‌ రహీం(32) కర్నూలు నుంచి వచ్చి ఇంటికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అబ్దుల్‌ రహీం తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కడప రిమ్స్‌కు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

‘మాకు హాని కలిగితే వారిదే బాధ్యత’

పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన జంట

బ్రహ్మంగారిమఠం : మండలంలోని దిరసవంచ పంచాయతీ కమ్మవారిపల్లెకు చెందిన వెంకటసుబ్బయ్య, మంజుల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు శుక్రవారం బి.మఠం పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మంజుల విలేకరులతో మాట్లాడుతూ ‘మేము ఇద్దరం ఒకే కులానికి చెందిన వారం. మాకు 2023లో వివాహం అయ్యింది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్తకు యాక్సిడెంట్‌ కావడంతో రెండు కాళ్లు పని చేయడం లేదు. అయినా ప్రైవేట్‌ ఉద్యోగం చేసి నన్ను బాగానే చూసుకుంటున్నాడు. మాకు వివాహం అయినప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు గ్రామంలోకి రావద్దు అని వస్తే చంపుతామని బెదిరించడంతో భయంతో.. ఇన్నాళ్లు కర్ణాటకలో ఉన్నాం, మా భర్తకు చెందిన వ్యవసాయ భూములను చూసుకొనేందుకు గ్రామానికి వారం రోజుల క్రితం వచ్చాం. గ్రామంలోకి రాగానే మా భర్త కుటుంబ సభ్యులపై.. మా బంధులవులైన ముద్దుకృష్ణంనాయుడు, భగీదనాయుడు, చంద్రబాబు నాయుడు, శేషాద్రినాయుడు చంపుతామని హెచ్చరిస్తున్నారు. వారు చంపుతారో ఏమోనని ఎస్పీని ఆశ్రయించాం, స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయమనడంతో వచ్చాం. నాకు గానీ నా భర్తకు ఎలాంటి హాని కల్గినా వారి ద్వారానే జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాకు పోలీసులు సహకరిస్తారని కోరుకుంటున్నాం’ అని ఆమె వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement