ఎకై ్సజ్‌ నేరాలను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ నేరాలను నియంత్రించాలి

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌శర్మ

కడప సెవెన్‌రోడ్స్‌ : నాటుసారా, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా, నార్కోటిక్‌ డ్రగ్స్‌ తదితర ఎకై ్సజ్‌ నేరాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో కడప, అన్నమయ్య జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ వల్ల జరిగే దుష్ప్రరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నాటుసారా తయారీ, అమ్మకాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి అరికట్టాలన్నారు. అనంతరం స్టేషన్ల వారీగా క్రైం రివ్యూను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జయరాజు, ఆసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు రమేష్‌, సీఐలు పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

కడప వైఎ,స్‌ఆర్‌ సర్కిల్‌: జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండ్‌గా జె. రమేష్‌ గురువారం నగరంలోని తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలో ఆసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండ్‌గా పని చేస్తూ పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అక్రమ మద్యం, నాటు సారా వంటి వాటిపై దృష్టి పెడతామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement