ఎన్యుమరేషన్‌ పత్రం కోసం వచ్చా! | - | Sakshi
Sakshi News home page

ఎన్యుమరేషన్‌ పత్రం కోసం వచ్చా!

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

ఎన్యుమరేషన్‌ పత్రం కోసం వచ్చా! ఆ పత్రం లేదంటున్నారు

నేను గతంలో రవీంద్రనగర్‌లో నివాసం ఉన్నాను. ఆ తర్వాత కాగితాలపెంటలో చేరాను. 2002 నాటి జాబితాలో నా పేరుతోపాటు నా భార్య జూటూరు రసూల్‌బీ పేరు కూడా ఉంది. కాగితాలపెంట బీఎల్‌ఓ రవీంద్రనగర్‌ సచివాలయం వెళ్లి ఎన్యుమరేషన్‌ పత్రం తెచ్చుకోవాలని సూచించారు. ఇక్కడికి రాగా, నా భార్య పత్రం ఇచ్చారు. నా పత్రం అడిగితే లేదని చెబుతున్నారు.

– జూటూరు మహమ్మద్‌ హుసేన్‌ సాహెబ్‌, కాగితాలపెంట, కడప

నేను రవీంద్రనగర్‌లో ఉంటూ ఇల్లు మారాను. ఎన్యుమరేషన్‌ ఫారం తీసుకోవడానికి రవీంద్రనగర్‌ సచివాలయానికి వచ్చాను. అయితే నాకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ పత్రం ఇచ్చారు. నా భార్య మైమూన్‌ పత్రం లేదని చెబుతున్నారు. ఒకవేళ కనిపిస్తే ఇస్తామని బీఎల్‌ఓ అంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – కాలేషా, రవీంద్రనగర్‌, కడప

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement