కౌలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. తక్షణమే కౌలుదారుల ఖాతాలకు కూడా ‘అన్నదాత సుఖీభవ’ నిధులను వేసి వారిని ఆదుకోవాలి. పెట్టుబడి సాయం సకాలంలో అందించి వారు ప్రైవేట్ అప్పుల ఊబిలోకి వెళ్లకుండా రక్షించాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి కౌలు రైతులకు ఎలాంటి సహాయం అందలేదు. ఇప్పటికై నా కూటమి సర్కార్ స్పందించి కౌలు రైతులను ఆదుకోవాలి.
– గోపాల కృష్ణయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు.


