అధికారంలోకి వస్తే కౌలు రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా చెప్పింది. దాని ప్రకారం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కౌలు రైతులకు తక్షణమే పెట్టుబడి సాయం అందించాలి. క్షేత్రస్థాయిలో కేవలం గుర్తింపు కార్డులు మాత్రమే ఇస్తున్నారు తప్ప, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయమూ అందడం లేదు. ఇప్పటికై నా మోసపూరిత విధానాలు వీడి కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలి.
– సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు


