30న అరుణాచలానికి ప్రత్యేక బస్సు | - | Sakshi
Sakshi News home page

30న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలానికి కడప నుంచి ఈనెల 30వ తేదీ ప్రత్యేక బస్సు నడుపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9. గంటలకు కడపలో బయలుదేరి 10.15కు రాయచోటి మీదుగా అరుణాచలానికి బస్సు వెళుతుందన్నారు. ఈ బస్సులో రానుపోను చార్జీల కింద కడప, రాయచోటి నుంచి రూ.1050గా నిర్ణయించారన్నారు. సర్వీసు నంబర్‌ 913337తో తమ టిక్కెట్లను రిజర్వు చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు డీఎం 9959225774. కో ఆర్డినేటర్‌ 94404 49559 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

నిత్యాన్నదానానికి

రూ. 3లక్షల విరాళం

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కేంద్రానికి ఆదివారం రూ. 3లక్షల విరాళం అందింది. గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన ఆలపాటి మాధవరావు రూ. 1,01,116, ఆలపాటి కృష్ణ కుమారి రూ. 1,01,116, కృష్ణా జిల్లా వీరంకిలాకుకు చెందిన సుజాత రూ. 1,00,001 విరాశం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌కు అందజేశారు. అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.

మదనపల్లె ఆర్‌ఓకు

అరెస్ట్‌ వారెంట్‌

సాక్షి, అమరావతి: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) జీవి.పల్లవి అరెస్ట్‌కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్‌ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్‌ అడ్డుకోలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవిని ఆన్‌లైన్‌లో హజరుకావాలని తెలియజేసినప్పటికి హజరుకాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్‌ వారంట్‌ను జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకావాలని ఆదేశించింది. ఈ వారెంట్‌ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్‌చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరువుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది.

వెలుగు అక్రమాలపై విచారణ

బి.కొత్తకోట: స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారణ లోతుగా జరుగుతున్నట్టు తెలిసింది. ఏడాదిన్నర కాలంగా ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, ఫర్నిచర్‌ మాయం కావడం, మంజూరు చేసిన రుణాలు రికవరీ కాకపోవడం, సీ్త్రనిధి రుణాలకు సంబంధించి కొన్ని గ్రామాల నుంచి నిధులు రికవరీ కాకపోవడం, ఓ గ్రామంలో రుణాలు ఇచ్చినా పైసా వసూలు చేయకపోవడంపై డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రుణాల రికవరీ సంబంధించి ఇప్పటికే విచారణలో అధికారులు నివేదికలో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ నివేదికలపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్‌ మాయం కావడానికి ఏపీఎంను బాధ్యుని చేసి రూ.54 వేలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కోటావూరు డెయిరీ పేరుతో ఖర్చు చేసిన నిధుల వివరాలు, బి.కొత్తకోట డెయిరీకి సంబంధించిన నిధుల వ్యయంపైనా విచారణ జరగనున్నట్టు చెబుతున్నారు.

హాకీ జట్టు ఎంపిక

మదనపల్లె సిటీ : పట్టణంలోని బీటీ కాలేజీ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్‌ బాలికల హాకీ జట్టు సెలక్షన్‌ ట్ర యల్స్‌ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి శివప్రసాద్‌ తెలిపారు. ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేసి,ఏప్రిల్‌ 16 నుంచిచిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయిపోటీలలో అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement