ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకుసాగాలి | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకుసాగాలి

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

ఆత్మవ

ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకుసాగాలి

రాజంపేట : ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకుసాగాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించగలరని రాజంపేట సబ్‌కలెక్టర్‌ సీహెభావన పిలుపునిచ్చారు. బుధవారం అన్నమాచార్య యూనవర్సిటీలో మహిళ సాధికారిత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యాస్పైర్‌–అప్‌గ్రేడ్‌–విన్‌ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. నేటి ప్రపంచంలో మహిళల పాత్ర కీలకమన్నారు. నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అప్పుడే సమాజంలో మార్పు తీసుకురాగలమన్నారు. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలు విజయానికి మూలస్తంభాలన్నారు. సదస్సులో వీసీ డా.సాయిబాబారెడ్డి, కో–ఆర్డినేటర్‌ డా.మౌనేశ్వరి, ఈఈఈ హెచ్‌వోడీ డా.బాలచెన్నయ్య, ఈఈఈ కో–ఆర్డినేటర్‌ స్వాతి పాల్గొన్నారు.

ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకుసాగాలి 1
1/1

ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకుసాగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement