కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు పరిష్కరించాలి
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు టీచింగ్ గెస్ట్ ఫ్యాకల్టీల సమస్యల పరిష్కారం కోసం జనవరి 1వ తేదీన నిరసన చేపట్టనున్నట్లు కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ హుసేన్ తెలిపారు. బుధవారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందువల్ల నూతన సంవత్సరం రోజున నిరసన చేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీలు మణి కిరణ్, దేవిక, శ్రావణి, అశ్వని, భవదీయులు తదితరులు పాల్గొన్నారు.


