మత్తు పదార్థాలను విడనాడండి
కడప ఎడ్యుకేషన్ : మద్యం, మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మద్యం, మత్తు పదార్థాల వల్ల సమాజానికి, విద్యార్థుల భవిష్యత్తుకు కలుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన ‘ఉసురు తీస్తున్న మత్తు పదార్థాలు’ పోస్టర్లను బుధవారం జిల్లా ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు ‘నో’ చెప్పే చైతన్యవంతమైన తరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సరస్వతి మాట్లాడుతూ ప్రజల్లో శాసీ్త్రయ అవగాహన పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజశేఖర్ రాహుల్, జేవీవీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లు, నగర కమిటీ సభ్యులు భాస్కర్, మధుసూదన్, సి. పి.రమణ, విజయ్, రఘు తదితరులు పాల్గొన్నారు.


