ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. బుధవారం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆశీనులు చేసి, పట్టు వస్త్రాలు తొడిగి, బంగారు ఆభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి చెంత ధనుర్మాస పారాయణం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.


