రాష్ట్రంలో అధిక మండలాల జిల్లాగా కడప
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం చేరడంతో రాష్ట్రంలో అత్యధికంగా 40 మండలాలు ఉన్న జిల్లాగా వైఎస్సార్ కడప ఆవిర్భవించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నియోజకవర్గాలు, ఐదు రెవె న్యూ డివిజన్లు, 40 మండలాలు, ఒక కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీలతో జిల్లా ఆవిర్భవించిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 20,60,054 గా ఉన్న జనాభా ఇప్పుడు 22,96,497 కు చేరిందన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే జనాభాలో రెండవస్థానంలో నిలిచిందన్నారు. జనవరి 11 నుంచి గండికోట ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్పీ విశ్వనాథ్, రాజంపే ట సబ్ కలెక్టర్ భావన పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా ఆంక్షలు కఠినతరం
రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జి ల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్పీ విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు.
నాలుగు మండలాల్లో ..
రాజంపేట: రాజంపేట డివిజన్ లోని నాలుగు మండలాల్లో వైఎస్సార్ కడప నుంచి రెవెన్యూ పాలన జరగనున్నది. ఈ మేరకు బుధవారం కడప కలెక్టర్ శ్రీధర్ రాజంపేట సబ్‌కలెక్టరేట్‌లో డివిజన్‌లోని నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో రెవిన్యూ, అభివృద్ధి అంశాలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ శ్రీధర్


