ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న ప్రముఖులు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని బుధవారం పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. అందులో తమిళనాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ న్యాయ సభ్యురాలు జస్టిస్ పుష్ప సత్యనారాయణ దంపతులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్‌డీ కె. వెంకటకృష్ణ సతీసమేతంగా, రాజంపేట కోర్టు న్యాయమూర్తి పూజిత ఉన్నారు. వీరికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షిణ కావించి, గర్భాలయంలోని మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన వారిని ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీపీఓ ఏఓ ఖాదర్ బాషా, ఎంపీడీఓ సుజాత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, మండల టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు.


