కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి
పెండ్లిమర్రి : పెండ్లిమర్రి మండలం పగడాలపల్లె గ్రామంలో మంగళవారం కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పగడాలపల్లె గ్రామానికి చెందిన కొంచాని శివయ్య అనే గొర్రెల కాపరికి సంబంధించిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి త్రీవంగా గాయపరిచాయి. దాడిలో 25 పిల్లలు చనిపోయాయి. దాదాపు రూ.2 లక్షలు నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు.
మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని భద్రపరిచారు. 55 ఏళ్లు పైబడిన వ్యక్తి ఈ నెల 22న అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. అతన్ని జీఈ వార్డులో ఉంచి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తూ వచ్చారు. ఆరోగ్యం క్షీణించడంతో అతను మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని హాస్పిటల్ సిబ్బంది మార్చురీలో ఉంచారు. మృతుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రి అధికారులను సంప్రదించాలని మార్చురీ ఇన్‌చార్జి వరాలు తెలిపారు.
మహిళ అదృశ్యం
కలసపాడు : మండలంలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మైల బాలకాశమ్మ అనే మహిళ గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన బాల కాశమ్మకు మండలంలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మైల సురేష్‌తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. మూడు రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో మంగళవారం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఇన్‌చార్జి శంకర్ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
కడప అర్బన్ : కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చలమారెడ్డిపల్లె బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఇంటిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. మైదుకూరు మండలం లెక్కలవారిపల్లెకు చెందిన మంజుల, పెండ్లిమర్రి మండలం పాతసంగటిపల్లెకు చెందిన కిరణ్‌కుమార్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
బీజేపీ కిసాన్ మోర్ఛా జిల్లా
అధ్యక్షుడిగా అశోక్ రెడ్డి
కడప కోటిరెడ్డిసర్కిల్ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్ఛా జిల్లా అధ్యక్షుడిగా అన్నపురెడ్డి అశోక్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకం ఉంచి పదవి లభించేందుకు కృషి చేసిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి
కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి
కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి


