ప్రాణం తీసిన గుంతల రోడ్డు
– దైవదర్శనానికి వెళుతూ ముక్కోటి లోకాలకు..
– రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ టీచర్ మృతి
రైల్వేకోడూరు అర్బన్ : కోడూరు– తిరుపతి ప్రధాన రహదారిపై మండలంలోని శెట్టిగుంట గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడి టీచర్ ఆవుల లక్ష్మి (35) మృతి చెందారు. వివరాలిలా.. ఓబులవారిపల్లి మండలం కొత్తమంగంపేటలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తన భర్త పోతులయ్యతో కలిసి తిరుపతి ఆలయాలను దర్శించుకునేందుకు తెల్లవారుజామున స్కూటీలో బయలు దేరారు. శెట్టిగుంటవద్దకు రాగానే స్కూటీ గుంతలో పడడంతో ఒక్కసారిగా వెనుక కూర్చున్న లక్ష్మీ కింద పడింది. దీంతో వెనుక వస్తున్న లారీ ఆమె తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పోతులయ్యకు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన గుంతల రోడ్డు


