ఉపాధ్యాయులకు బోధన సమయాన్ని కేటాయించాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పిల్లలకు చదువు చెప్పే సమయాన్ని కేటాయించాలని బహుజన టీచర్స్ యూనియన్ (బీటీయూ ఏపీ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున కోరారు. మంగళవారం కడప బీటీయూ ఏపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాధ్యాయులకు బోధనలో స్వేచ్ఛనివ్వకుండా తాము చెప్పినట్లే చదువు చెప్పాలని ప్రభుత్వం అనడం ఉపాధ్యాయులలోని సృజనాత్మక శక్తిని దెబ్బతీయటమేనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. సుదర్శన్ బాబు, వైయస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు ఎం. గంగరాజు, కార్యనిర్వాహక సభ్యులు కె. జయరాముడు, టి.మనోహర్ పి. మురళి తదితరులు పాల్గొన్నారు.


