బి.మఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

బి.మఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

Dec 31 2025 7:19 AM | Updated on Dec 31 2025 7:19 AM

బి.మఠ

బి.మఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారు జామునే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గ్రామోత్సవం, భజనలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సౌత్‌ ఇండియా సైన్స్‌ఫేర్‌లో ప్రతిభ చాటాలి

కడప ఎడ్యుకేషన్‌ : రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రతిభను చాటిన కడప అంగడివీధి జిల్లా పరిషత్తు హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి గిరీష్‌ సౌత్‌ ఇండియా సైన్స్‌ఫేర్‌లో కూడా రాణించాలని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి ఆక్షాంక్షించారు. దక్షిణ భారత సైన్స్‌ఫేర్‌కి ఎన్నికై న 9వ తరగతి విద్యార్థి గిరీష్‌, గైడ్‌ టీచర్‌ మాధవి, నారాయణలను మంగళవారం డీఈఓ కార్యాలయంలో అధికారులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి వేపరాల ఎబినేజర్‌ తదితరులు పాల్గొన్నారు.

బి.మఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు   1
1/1

బి.మఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement