అయ్యప్ప స్వాముల మినీ బస్సుబోల్తా
సంబేపల్లె : మండలంలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై గురువారం రాత్రి అయ్యప్ప స్వాముల మినీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటన సంబేపల్లె మండల కేంద్రంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన 16 మంది అయ్యప్ప భక్తులు ఈ నెల 18 వ తేదీన శబరిమలై యాత్రకు వెళ్లారు. ఈ నెల 22వ తేదీన అయ్యప్పను దర్శించుకొని తిరిగి సొంత గ్రామానికి వెళుతుండగా సంబేపల్లె మండల కేంద్రానికి రాగానే అయ్యస్వాములు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. బస్సులో డ్రైవర్‌తో పాటు 15 మంది భక్తులు ఉన్నారు. డ్రైవర్ రాజు, ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో భక్తులు, స్థానికులు అయ్యప్ప స్వామి కాపాడాడని తలుచుకొన్నారు. సంఘటన స్థలాన్ని సంబేపల్లె పోలీసులు పరిశీలించారు.
అయ్యప్ప స్వాముల మినీ బస్సుబోల్తా
అయ్యప్ప స్వాముల మినీ బస్సుబోల్తా


