
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహకాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అదే దిశగా జిల్లాలో కూడా పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఏపీఐఐసీ జెడ్ ఏం శ్రీనివాసమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్ధన, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ చిన్నా రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డీడీఆర్‌ఎఫ్ అధికారులు, డీటీఓ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ, ఏపీఎస్ పీడీసీఎల్ శాఖల అధికారులు, ఏపీఐఐసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రుణాల మంజూరు బ్యాంకర్లు చొరవ చూపండి
వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాల మంజూరుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో ఎల్‌డీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో క్రాప్ లోన్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం జనార్ధనం, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు డాక్టర్ రాజ్యలక్ష్మీ, కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు చంద్రానాయక్, రవి చంద్రబాబు, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ లక్ష్మీతులసి, నాబార్డ్ డీడీఎం విజయ విహారి, ఆర్‌ఎం ఎస్‌బీఐ కృష్ణ కిషోర్, వివిధ బ్యాంకు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి
పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా క్రైసిస్ గ్రూప్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల లోపలే కాకుండా పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని మరింత భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ చిన్నారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీఎస్ పీడీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, ఫైర్ శాఖ, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి