
కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పనిచేయడంలేదు
తమ సొంత భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని శుక్రవారం మైలవరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఓ అధికార పార్టీ కార్యాకర్తను సాక్షి పలుకరించగా ఇక్కడి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. మా అబ్బ బండల పెద్ద బికారి కొన్ని సంవత్సరాల క్రితం దూ దేకుల పెద్దయ్యతో భూమిని కొనుగోలు చేశాడు. చిన్న వెంతుర్ల పొలంలో 669/2 సర్వేనంబర్ 1.12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి హక్కుదారుడిగా మా అబ్బపేరు రెవెన్యూ రికార్డుల్లో కనిపించడంలేదు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కాగితాలతోపాటు ఈసీ, ఆర్‌హెచ్ ధృవ పత్రాలను రెవెన్యూ అధికారులకు అందజేశాను. అయినప్పటికి అధికారులు సిబ్బందిపై సాకులు చెబుతూ కాలయాపన చెస్తున్నారే తప్ప రెవెన్యూ రికార్డుల్లో మా అబ్బపేరును చేర్చడంలేదు. అన్ని ఆధారాలు సమర్పించిన ఈ ఫైల్ వందశాతం సక్రమమైనని తెలిసిన అధికార పార్టీకార్యకర్తలమైన తమనే కార్యాలయం చుట్టూ తిప్పుకుకంటున్నారు. ఏ పలుకు బడి లేని సామాన్య ప్రజల పనులు ఏ మేరకు జరుగుతాయో మీరే చెప్పాలి. మైలవరం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు కార్యాలయంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారిని ఇక్కడి నుంచి బదిలి చేసి మొత్తం ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నా.
– బండల ఇబ్రహీం, చిన్న వెంతుర్ల, మైలవరం