
విద్యుదాఘాతంతో రైతు మృతి
మైలవరం : మండలపరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన ఏరాసీ సుబ్బరామిరెడ్డి (59) విద్యుదా ఘాతంతో మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకొంది. పోలీస్‌ల వివరాల మేరకు.. పెన్నానదిలో తన పొలం కోసం వేసుకున్న బోర్ వద్ద స్టాటర్ తోలగించడానికి వెళ్లి పొరపాటున కరంట్ వైర్లను పట్టుకొని సుబ్బిరామిరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. మైలవరం రిజర్వాయర్ ద్వారా పెన్నానదికి నీరు వదలడంతో తన స్టాటర్ మునిగిపోతుందనే ఉద్దేశంతో తీసివేయాలని వెళ్లి విద్యుత్ ప్రమాదంతో మృతి చెందాడని తెలిపారు.
బైకు ఢీకొని ఇద్దరికి గాయాలు
వేంపల్లె : వేంపల్లె – కడప రోడ్డులో గుర్తుతెలియని బైకు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు ప్రొద్దుటూరు నుంచి చక్రాయపేట మండలంలో ఉన్న గండి క్షేత్రానికి నడుచుకుంటూ 13 మంది బయలుదేరారు. వేంపల్లె దగ్గర సమీపంలో గుర్తుతెలియని బైకు ఒకసారిగా మీదకు వచ్చింది. దీంతో ఎం.అంజి కుమార్, వాసు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి వెనుక వస్తున్న కొందరు గమనించి ప్రథమ చికిత్స కోసం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైకు ఢీకొట్టిన వారు అక్కడ నుండి బైకును తీసుకొని పారిపోయారు. గండిక్షేత్రంలో ఉన్న వారి బంధువులకు సమాచారం తెలపడంతో హుటాహుటినా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఢీకొట్టిన బైకును కనుగొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
సింహాద్రిపురం : మండలంలోని రామగిరి గ్రామానికి చెందిన రోషిణి అనే మహిళను శుక్రవారం రెండవ కాన్పు నిమిత్తం 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ్వవయ్యాయి. 108 వాహన సిబ్బంది ఈంటీ గంగాధకర్, పైలెట్ చిరంజీవిలు అంబులెన్స్‌లోనే జాగ్రత్తగా ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. తల్లికి తగిన వైద్యం అందించి తల్లీ బిడ్డలను క్షేమంగా పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. దీంతో 108 అంబులెన్స్ సిబ్బందిని ప్రజలు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
గంజాయి వినియోగం,
విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు
కడప అర్బన్ : ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం, విక్రయాలపై డీఎస్పీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. గంజాయి సేవించే, విక్రయించే అవకాశమున్న ప్రాంతాలు, ప్రదేశాలలో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవనని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ హెచ్చరించారు. కిరాణా షాపులు, గోడౌన్‌లు, పాడుబడ్డ క్వార్టర్‌లు, భవనాలలో గంజాయి సేవించే, విక్రయించే వారి కోసం సిబ్బందితో అణువణువూ అన్వేషిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వారిపై నిఘా ఉంచడంతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించేందుకు విస్తత చర్యలు చేపట్టారు. ప్రజలు గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి