ఆ ముగ్గురికి మాత్రం చార్జిమెమోలా? | - | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురికి మాత్రం చార్జిమెమోలా?

Aug 23 2025 2:41 AM | Updated on Aug 23 2025 2:41 AM

ఆ ముగ

ఆ ముగ్గురికి మాత్రం చార్జిమెమోలా?

– కడప కేంద్ర కారాగారంలోనైతే

‘ఏడుగురు’ సస్పెన్షనా

కడప టాస్క్‌ఫోర్స్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లాలో జైళ్లశాఖ అధికారుల చర్యలు ఒక్కో వ్యవహారంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప కేంద్ర కారాగారంలో ఇటీవల పిడియాక్ట్‌ రిమాండ్‌ ఖైదీ జాకీర్‌ వద్ద దశల వారిగా 12 సెల్‌ఫోన్‌లు, ఒక చార్జర్‌ లభించాయి. ఈ సంఘటన ను చక్కదిద్దడానికి క్రమశిక్షణా చర్యల క్రింద ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్లను సస్పెన్షన్‌ చేస్తూ విచారణ అధికారిగా వచ్చిన డిఐజీ ఎ.ఆర్‌ రవికిరణ్‌ నివేదిక మేరకు రాష్ట్ర డిజి సస్పెన్షన్‌ వేటు వేశారు. తరువాత రోజుల తరబడిగా విచారణ కొనసాగుతోంది. సాక్షాత్తు రాష్ట్ర డిజి అంజనీకుమార్‌ కడప కేంద్ర కారాగారంకు వచ్చి విచారణ చేశారు. తరువాత ఇటీవల ప్రొద్దుటూరు సబ్‌జైలుకు చోరీల కేసుల్లో మహమ్మద్‌ రఫీ అనే 32 కేసులున్న నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈనెల 16తేదీన తెల్లవారు జామునే రిమాండ్‌ఖైదీ పరారయ్యాడు. వారిపై విచారణ అధికారి హుటాహుటిన వెళ్లి సమగ్రంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న ముగ్గురికి ‘చార్జ్‌మెమోలు’ ఇచ్చి ‘మమ’ అనిపించారు. కడప కేంద్ర కారాగారంలో ఏడుగురిని ‘బాధ్యతా రాహిత్యం’గా వ్యవహరించారనీ నివేదికను పంపగా సస్పెన్షన్‌ చేశారు. రిమాండ్‌ ఖైదీని కడప కేంద్ర కారాగారంకు పంపించినా, ప్రొద్దుటూరు సబ్‌ జైలు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించినా ‘రిమాండ్‌ ఖైదీ పరారీ’ సంఘటన జరిగి వుండేది కాదనీ భావిస్తున్నారు. ప్రొద్దుటూరులోని ముగ్గురు సిబ్బందిలో ఒక హెడ్‌ వార్డర్‌కు కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలున్నాయనీ సమాచారం.

రెండు సచివాలయాల్లో

జిల్లా టాస్క్‌ఫోర్స్‌ టీం పర్యటన

ప్రొద్దుటూరు రూరల్‌ : మండలంలోని చౌడూరు, కామనూరు గ్రామాల సచివాలయాల్లో శుక్రవారం డీపీఎంఓ డాక్టర్‌ శశిభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ టీం పర్యటించింది. ఈ సందర్భంగా డీపీఎంఓ డాక్టర్‌ శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ సీ్త్ర గర్భవతిగా నమోదైనప్పటి నుంచి సుఖప్రసవం అయ్యేవరకు అన్ని రకాల ఆరోగ్య సేవలను వైద్యాధికారులు, సిబ్బంది చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వైద్య సిబ్బందికి ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు సహకరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ ఉండాలని, దీని వలన రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం ఓపీ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌, ఈపీఎంయూ నారాయణ, ఎంఐఎస్‌ రాజశేఖర్‌, డీపీహెచ్‌ఎన్‌ఓ శాంతిలత, సీహెచ్‌ఓ కృష్ణమ్మ, సూపర్‌వైజర్‌ బీఏ వరప్రసాద్‌, చంద్రకళ, సీహెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికబద్ధంగా

వృద్ధి సాధించాలి

– జేసీ అదితిసింగ్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రణాళికబద్ధంగా జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని రంగాల్లో వృద్ధి రేటు సాధించాలన్నారు. జిల్లాలో ఉత్పాదతకను పెంచేందుకు కృషి చేయాలన్నారు. పర్యాటక, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమ, వైద్య ఆరోగ్యం, మార్కెటింగ్‌, ఆయుష్‌, ఇరిగేషన్‌, పరిశ్రమలు, పంచాయతీరాజ్‌ శాఖలు సూచికల ఆధారంగా సాధించిన లక్ష్యాలను, రానున్న సంవత్సరానికి టార్గెట్‌లపై జేసీ చర్చించారు. కార్యక్రమంలో సీపీఓ హజరతయ్య, పరిశ్రమలశాఖ జీఎం చాంద్‌బాష, ఐసీడీఎస్‌ అధికారి రమాదేవి, పశుసంవర్దకశాఖ జేడీ శారదమ్మ, పర్యాటక అధికారి సురేష్‌, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

ఆ ముగ్గురికి మాత్రం చార్జిమెమోలా? 1
1/1

ఆ ముగ్గురికి మాత్రం చార్జిమెమోలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement