
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కోసం పెద్దదర్గాలో ప్రార్థనలు
కడప సెవెన్‌రోడ్స్ : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు బుధవారం పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వారు దర్గాలోని ప్రధాన గురువులు హజరత్ పీరుల్లాసాహెబ్ మాలిక్ మజార్‌ను దర్శించుకుని ఫాతెహా చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ మాట్లాడుతూ మృదు స్వభావి, ప్రజా నాయకుడు, సామాన్య కార్యకర్తను కూడా ఎంతో అభిమానంతో పలకరించే మిథున్‌రెడ్డిని రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఎన్‌ఆర్‌ఐలతోపాటు వారి కుటుంబ సభ్యులకు తమవంతుగా తోడ్పాటు అందించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బెయిలుపై విడుదల కావాలని దర్గా గురువులను ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ సభ్యులు షేక్ గఫార్, ఎన్.సుబ్బారెడ్డి, సి.అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్, ప్రధాన అధికార ప్రతినిధి షేక్ గౌస్ బాషా (చాక్లెట్) కార్పొరేటర్లు షేక్ షంషీర్, షేక్ జిలాన్ (డిష్ జిలాన్), జి.ప్రవీణ్, కుమార్‌రెడ్డి, షేక్ గయాజ్, బాబుభాయి, నాసర్, రాజాసాబ్, పీర్‌బాషా, ఫారూఖ్, అహ్మద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.