
వైఎస్ఆర్ జిల్లా: బిహార్ రాష్టర తరహాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిందని జిల్లా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్న ఎంపిక చేసుకుని కొన్ని స్థానాలకే ఎన్నికలు జరిపారన్నారు.
‘ఆయుధాలను చూపి ప్రజలను బెదిరించి ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎన్నికల్లో కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. అదే ఫోటోను నారా లోకేష్ ప్రజాస్వామ్యం గెలిచిందని ట్వీట్ చేసారు. అక్కడే అర్థం అయింది
ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో?, ప్రజలను ఓటు వేసేందుకు వస్తుంటే బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.