
పశుసంవర్ధకశాఖ రాష్ట్ర సంఘంలో జిల్లావాసులు
కడప అగ్రికల్చర్: విజయవాడ పశుసంవర్థశాఖ రాష్ట్ర సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా నుంచి ముగ్గురికి చోటు లభించింది. వేల్పులలో లైవ్ స్టాక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చాంద్‌బాషాకు ఏపీ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్– వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు దక్కింది. అలాగే ఊటుకూరులో లైవ్‌స్టాక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్యకు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షుడిగా, ఖాజీపేట మండలం ఆంజనేయకొట్టాలులో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గంగయ్యకు ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు లభించింది. మన జిల్లా నుంచి రాష్ట్ర సంఘానికి ఎన్నికై నందుకు వైయస్సార్ కడప జిల్లా తరఫున అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలియచేశారు. ఏపీ జూనియర్ వెటర్నీరీ ఆఫీసర్స్ అండ్ వెటర్నరీ ౖౖలైవ్ స్టాక్ ఆఫీసర్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు సదాశివయ్య, విద్యాసాగర్, మనీ, వెంకటసుబ్బయ్య, సునీల్, వీరకుమార్, మహదేవ, రమేష్ , పెంచలయ్య, శ్రీనివాసులు, మోహన్, సాయి తదితరులు పాల్గొన్నారు.