
జావెలిన్ త్రో స్టేట్ ఫస్ట్ సూఫియాన్
కమలాపురం : కమలాపురం దర్గా వీధికి చెందిన ఎస్. సూఫియాన్ కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కడపలోని డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న సూఫియాన్ బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు జరిగిన 36వ ఏపీ స్టేట్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–14 కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. కాగా స్పోర్ట్స్ స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్‌ను, అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోచ్ వెంకటేశ్వర్లును ప్రిన్సిపల్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.
జావెలిన్‌త్రోలో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్