
ఆవుల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సంబేపల్లె : వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఆవుల వేణుగోపాల్ రెడ్డి మరణ వార్తను మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు. సోమవారం ఆవుల కుమారులు ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, ఆయన సోదరుడు ఆవుల మల్లికార్జున రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడి తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డిలు కూడా ఫోన్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
నివాళులు అర్పించిన ప్రముఖులు..
రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట మోహన్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారక నాథ్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ, దేశాయి తిప్పారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్‌సీపీ మదనపల్లె ఇన్‌చార్జ్ నిస్సార్ అహ్మద్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ నల్లారి తిమ్మారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహమ్మద్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ ఛైర్మన్ దశరథరామిరెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఆవుల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ