
కదులుతున్న రైలు ఎక్కబోయి యువకుడి దుర్మరణం
జమ్మలమడుగు : కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు(18) దుర్మరణం చెందాడు. ఆదివారం రాత్రి ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో ముంబై–ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతున్న సమయంలో అందులో ఎక్కబోయి ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో మృతి చెందినట్లు. కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపారు. యువకుడి వివరాలు తెలియలేదన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు.
ఉపాధి పనులను
పరిశీలించిన కేంద్ర బృందం
అట్లూరు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పనులను కేంద్ర పరిశీలక బృందం సభ్యుడు దయానందరెడ్డి పరిశీలించారు. తొలుత వరికుంట పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరిగిన తీరును ఆరా తీశారు. అలాగే తంబళ్లగొంది పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన 5 పనులను, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడీ ఆనంద్, ఏఓ భాస్కర్‌రావు, ఏపీఓ జయచంద్రబాబు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

కదులుతున్న రైలు ఎక్కబోయి యువకుడి దుర్మరణం