
విలేకరి బెదిరిస్తున్నాడని మహిళా సర్పంచ్ ఫిర్యాదు
కాశినాయన : మండలంలోని కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ చెన్నుపల్లె సుభద్రమ్మ తనను మహబూబ్ బాషా అనే పత్రికా విలేకరి వేధిస్తున్నాడని సోమవారం నరసాపురం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ రమణకు ఫిర్యాదు చేశారు. తాను విలేకరినని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతికి పీఏను అని పాత పనులకు బిల్లు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని సర్పంచ్ తెలిపారు. 2017–18 సంవత్సరంలో తాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్డిని నిర్మించానని, అప్పుడు తనకు బిల్లులు రాలేదని, ఇప్పుడు బిల్లులు ఇవ్వాలని వేధిస్తున్నాడని పేర్కొన్నారు.
సర్పంచ్‌పై విలేకరి ఫిర్యాదు
రూ.50 లక్షలు గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని పత్రికలో తాను వార్త రాసినందుకు సర్పంచ్, ఆమె బంధువులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని నరసాపురం పోలీస్ స్టేషన్‌లో విలేకరి మహబూబాషా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.