
సీఎంఓ డైరెక్షన్‌లో పులివెందుల ఎన్నిక
పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే
కడప సెవెన్‌రోడ్స్ : ముఖ్యమంత్రి కార్యాలయ డైరెక్షన్‌లోనే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని, అధికార దుర్వినియోగం, దౌర్జన్యా లు, రిగ్గింగ్‌లతో గెలవాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సీఎంఓ డైరెక్షన్‌లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పనిచేస్తున్నారన్నారు. సోమవారం సాయంత్రం కడపలోని తమ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం 10,601 ఓట్లు ఉన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్య మంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే, ఎస్పీ ఎర్రచందనంపై ప్రెస్‌మీట్ నిర్వహించడం, డీఐజీ పత్తి వ్యాపారం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డిపల్లె గ్రామంలో, ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఎర్రబల్లి గ్రామంలో తిష్టవేసి చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే మనుషులను తరలించారన్నారు. స్లిప్పులు ఓటర్లకు పంపిణీ చేయకుండా అధికారులు టీడీపీ వారికి ఇస్తున్నారని విమర్శించారు. ఆ స్లిప్పులు తీసుకుని బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లు వేయనున్నారని ఆరోపణలు చేశారు. ఇందుకు అభ్యంతరం చెప్పే ఏజెంట్లను లేకుండా చేశారన్నారు. మగవాళ్లందరికీ బైండోవర్ కేసులు బనాయించారని, రైతులను తోటల వద్దకు కూడా వెళ్లనీయడం లేదన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలా నాలుగు వేల ఓట్లు రిగ్గింగ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 100 కోట్లు అధికార పార్టీ ఖర్చుచేసేందుకు సిద్దమైందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం ద్వారా ఓటర్ల మనస్సు గెలుచుకుని ఎన్నికల్లో గెలవాల్సింది పోయి విచ్చలవిడి దౌర్జన్యకాండకు దిగడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. పులివెందులలో గెలిచామని చెప్పుకునేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా ఎన్నికల్లో అక్రమాలు జరగలేదన్నారు. తాము కూడా ఇలా అనుకుని ఉంటే టీడీపీ వారు తిరిగే వారా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతీరెడ్డి వాట్సాప్ కాల్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ఎన్నికలు పోలీసు వ్యవస్థకు కూడా సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, నాయకులు పులి సునీల్‌కుమార్, నిరంజన్‌రెడ్డి, షఫీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దౌర్జన్యాలు, రిగ్గింగ్‌తో
గెలిచేందుకు యత్నాలు
స్లిప్పులు ఓటర్లకు కాకుండా
టీడీపీ వారికి పంపిణీ
బయట వ్యక్తులతో ఓట్లు వేయించుకునేందుకు కుట్రలు
ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి