
పిడుగుపాటుతో విద్యుత్ సామగ్రి దగ్ధం
అట్లూరు : ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పాటుకు మండల పరిధిలోని వళసపాళెం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామస్తుల వివరాల మేరకు శనివారం రాత్రి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో విస్తారంగా వర్షం కురిసింది. అయితే అదే తరుణంలో భయంకరమైన మెరుపుతో గ్రామంలోని చిట్టెం వెంకటసుబ్బారెడ్డి, రామసుబ్బమ్మల ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో వెంకటసుబ్బారెడ్డి బద్వేలులో వివాహ కార్యక్రమానికి వెళ్లారు. ఆయన భార్య రామసుబ్బమ్మ కూడా గ్రామంలోని రామాలయంలో భజన కార్యక్రమంలో ఉన్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. వారి ఇంటిలోని విద్యుత్ పరికరాలు, ఫ్రిజ్, తాగు నీటి మోటారుకు సంబంధించిన స్టార్టర్ పూర్తిగా కాలిపోయాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వీధిలైట్లు సైతం పగిలిపోయాయని గ్రామస్తులు తెలిపారు.

పిడుగుపాటుతో విద్యుత్ సామగ్రి దగ్ధం