
సహకార సంఘాలకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు
కడప అగ్రికల్చర్: జిల్లాలోని 30 సహకార సంఘాలకు ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. సాధారణంగా ఎన్నికలను నిర్వహించి ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకుండా సొసైటీలో సభ్యత్వం ఉన్న వారిలోనే ఒకరిని చెర్మెన్‌గా మరో ఇద్దరిని కమిటీ మెంబర్స్‌గా ఎంపిక చేయడం గమనార్హం.
జిల్లా స్కౌట్ రోవర్‌కు ‘నేషనల్ లీడర్‘ పురస్కారం
కడప ఎడ్యుకేషన్: వైఎస్‌ఆర్ కడప జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు చెందిన స్కౌట్ రోవర్ సగినాల అహమ్మద్ ‘నేషనల్ కంటింజెంట్ లీడర్ అవార్డు‘ సాధించారు. ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని పెరంబూరు (సదరన్ రైల్వే)లో నేషనల్ రోవర్/ రేంజర్ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్‌కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రేంజర్లు, రోవర్లు హాజరు కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి పులివెందులకు చెందిన సగినాల అహమ్మద్ పాల్గొని వివిధ అంశాల్లో చక్కటి ప్రతిభను కనబరచటంతో పాటు ఓవరాల్‌గా ‘స్టేట్ బెస్ట్ కంటింజెంట్ లీడర్‘ అవార్డుకు ఎంపికయ్యాడు. జిల్లాకు చెందిన స్కౌట్ జాతీయస్థాయిలో కంటింజెంట్ లీడర్ అవార్డును అందుకోవడంపై జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎఫ్‌ఏ–1 పరీక్షలు
పకడ్బందీగా నిర్వహించాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ఎఫ్‌ఏ– 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని దీంతోపాటు ప్రతి విద్యార్థికి అసెస్‌మెంట్ బుక్‌లెట్ అందాలని పాఠ్యపుస్తకాల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ రాము ఆదేశించారు. ఆదివారం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కడప నగరంలోని సీఎస్‌ఐ పాఠశాలలో గల డీసిఈబీ హాల్‌ను, వల్లూరు మండల వనరుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి తరగతి వారీగా సబ్జెక్టు వారీగా అసెస్మెంట్ బుక్కును తప్పనిసరిగా అందించా లని సూచించారు. అసెస్మెంట్ బుక్‌లో ఆగస్టు, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు అసెస్మెంట్ బుక్స్‌ను భద్రంగా ఉంచుకొని తర్వాత పరీక్షలకు ఇందులో నిర్వహించాలని సూచించారు. డీసీఈబీ సెక్రటరీ విజ య భాస్కర్ రెడ్డి, కడప మండల విద్యాశాఖ – 2 షేక్ ఇర్షాద్ అహ్మద్, ఉమ్మడి జిల్లా బుక్స్ గోడౌన్ మేనేజర్ రామాంజనేయమ్మ , జిల్లా బుక్స్ గోడౌన్ సిబ్బంది నరేష్, అనిల్, కడప సీఆర్‌ఎంటిలు పాల్గొన్నారు.
జిల్లాలో జోరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి, ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, ముద్దనూరు మినహా మిగతా 32 మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో పెండ్లిమర్రిలో అత్యధికంగా 69.6 వర్షం నమెదుకాగా అత్యల్పంగా వీఎన్‌పల్లిలో 1.4 మి.మీ వర్షం నమోదైంది.

సహకార సంఘాలకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు

సహకార సంఘాలకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు