
ఎస్సీకి రాఖీ కట్టిన ఓం శాంతి అక్కయ్యలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌కు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శాంతి సాధనకు తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి సంస్థ ప్రతినిధులు బ్రహ్మకుమారి గీతా అక్కయ్య, సుశీల అక్కయ్య, ఈశ్వరీ అక్కయ్య, ప్రదీప అక్కయ్య పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
కడప రూరల్ : జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ కడప నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వెస్ట్, పొల్యూషన్, ధరల పట్టిక, నీటి వసతి, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే అర్హత కలిగిన సిబ్బంది గురించి ఆరా తీశారు. నిబంధనలను అతిక్రమించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్‌ఈఓ కుమారి తదితరులు పాల్గొన్నారు.
జూటూరు డిజిటల్‌లో ఆఫర్లు
ప్రొద్దుటూరు : శ్రావణ మాసం పురస్కరించుకుని జూటూరు డిజిటల్ షోరూంలలో ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ యజమాని జూటూరు మధుసూదన్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం, ఆది వారం ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని జూటూరు డిజిటల్ షోరూంలలో డిస్కౌంట్ ధరలలో ఎలక్ట్రానిక్ పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, హోమ్, కిచెన్ అ ప్‌లైన్స్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 50 శా తం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నట్టు తెలిపా రు. జీరో శాతంతో వడ్డీ రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు తెలిపారు.

ఎస్సీకి రాఖీ కట్టిన ఓం శాంతి అక్కయ్యలు

ఎస్సీకి రాఖీ కట్టిన ఓం శాంతి అక్కయ్యలు