
బ్రహ్మంసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి శనివారం తెలుగుగంగ ఇన్‌చార్జి ఎస్‌ఈ వెంకటరామయ్య ఎడమ కాలువకు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సాగర్‌లోకి 1350 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు వస్తుందన్నారు. రైతులు సాగు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, ఎస్సార్ శ్రీనివాసులరెడ్డి, జోగయ్య, నరసింహులు, సాంబశివారెడ్డి, నారాయణ యాదవ్, శివయ్య యాదవ్, డీఈఈ మురళీమోహన్, ఏఈఈ మద్దం నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.