
గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి విశేష ఆదరణ
పులివెందుల/వేంపల్లె: గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి వైఎస్సార్‌సీపీకి విశేష ఆదరణ లభిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె, తండా, మల్లికార్జునపురం (దళితవాడ), ఎర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆ గ్రా మంలోని శివాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెడ్పీటీసీ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు.
కూటమి కుట్రలను ఓటుతో తిప్పికొడదాం
ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతల కుట్రలు, కుతంత్రాలను ఓటుతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు కృష్ణా జలాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగలా చేసిన ఘనత వైఎస్సార్‌సీపీదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకట్రెండు అమలు చేసి అన్ని ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50ఏళ్లకుపైబడిన వారికి పెన్షన్ పథకం అమలు చేస్తామని చెప్పి తుంగలో తొక్కిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఓడిపోతామని తెలిసి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను బైండోవర్ పేరుతో పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రచారం చేయనీయకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆ గ్రామంలో టీడీపీ, కూటమి నేతలు ఉన్నారని వైఎస్సార్‌సీపీ నాయకులను అక్కడికి ప్రచారానికి వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి, మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప క్రీడా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు భరత్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలోఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి

గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి విశేష ఆదరణ