
జిల్లాలో పలు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ఒంటిమిట్టలో అత్యధికంగా 70.8 మి.మీ కురిసింది. అలాగే అట్లూరులో 48.2 , గోవపరంలో 40, పెండ్లిమర్రిలో 28.4, చక్రాయపేటలో 20.4, సిద్దవటంలో 10.2, బద్వేల్‌లో 12.2, బి. కోడూరులో 6.2, బిమఠంలో 4.8 , ప్రొద్దుటూరులో 5, రాజుపాలెంలో 3.4, కమలాపురంలో 2.6, కడప, వీఎన్‌పల్లిలలో 2.2 , వేములలో 2 చెన్నూరు, తొండూరులలో 1.2 మి.మీ వర్షపాతం నమోదయింది. ఈ వర్షంతో వరినాట్లతోపాటు ఆరుతడి పంటలకు కొంత మేలు జరగనుంది.
సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహించకూడదు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల వారు ప్రభుత్వ సెలవు రోజు ల్లో తరగతులు నిర్వహించకూడదని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. నిబంధలకు వ్యతిరేకంగా ఎవరైనా ఎలాంటి తరగతులు, ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని చెప్పారు. జిల్లాలోని డిప్యూటీ ఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఈ ఉత్తర్వులు పాటించేలా చూడాలని.. పర్యవేక్షించాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆదేశించారు.
11వ తేదీ నుంచి అనుమతి లేని
ప్లే స్కూల్స్ తెరవకూడదు...
జిల్లావ్యాప్తంగా 11వ తేదీ సోమవారం నుంచి అనుమతులు పొందని ప్లేస్కూల్స్ తెరవకూడదు, తరగతులను నిర్వహించకూడదని ఆయా యాజమాన్యాలకు డీఈఓ షేక్ షంషుద్దీన్ సూచించారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలలపై తగు చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
యూరియాను
అధిక ధరకు అమ్మితే చర్యలు
కడప అగ్రికల్చర్: జిల్లాలో ఎరువుల డీలర్లు ఎవరైనా యూరియాను అధిక ధరలకు అమ్మితే చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్‌కు వచ్చిన యూరియా రాక్‌ను జేడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో గోవర్థన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉమ్మడి కడప జిల్లాకు 1335 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. ఇందులో వైఎస్సార్‌జిల్లాకు 870 మెట్రిక్ టన్నులు రాగా ఇందులో 400 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్‌కు కేటాయించామన్నారు. మిగతా 470 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించామన్నారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 465 టన్నులు రాగా ఇందులో 265 టన్నులను మార్కెఫెడ్‌కు, మిగతా 200 టన్నులను ప్రైవేటు డీలర్లు కేటాయించామని తెలిపారు. ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలో పలు మండలాల్లో వర్షం