
ఊయలే.. ఉరితాడై
– గొంతుకు బిగుసుకుపోయి బాలిక మృతి
జమ్మలమడుగు : సరదాగా ఆడుకునే ఊయలే.. గొంతుకు బిగుసుకుపోయి అరీఫా(9) ప్రాణం తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప చనిపోవడంతో ఇంటిల్లిపాదీ కన్నీరు మున్నీరయ్యారు. ఎర్రగుంట్ల పట్టణం వినాయకనగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను విషాదంలో నింపింది. సీఐ నరేష్‌బాబు వివరాల మేరకు.. వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న అలీబాషా స్థానిక నాపరాయి గనిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కుమార్తె ఆరీఫా పట్టణంలోని ప్రభు త్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సా యంత్రం స్కూల్‌నుంచి వచ్చిన ఆరీఫా ఇంట్లో ఎవ రూ లేకపోవడంతో ఊయలతో సరదాగా ఆడుకుంటోంది. ఈ సందర్భంగా చీర ఊయల మెడకు బిగించుకుపోవడంతో ఊపిరాడక మరణించింది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు పాపను చూసి సృహ కో ల్పోయిందని భావించి ఆసుపత్రికి తీసుకుపోయారు. వైద్యులు పరీక్షించి ఆరీఫా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పాప మరణం స్థానికులను కలవరపెట్టింది.
మహిళ అదృశ్యం
బి.కోడూరు : మండలంలోని మున్నెల్లి పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామానికి చెందిన కొండా దొరసానమ్మ ఈ నెల 3వతేదీ నుంచి కనిపించడం లేదని తండ్రి కొండావెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుఎస్‌ఐ సురేష్ తెలిపారు. ఆయన వివరాల మేరకు... తనపై దొంగతనం మోపారని మనస్తాపానికి గురైన దొరసానమ్మ ఈ నెల 3న ఇంటినుంచి వెళ్లిపోయింది. గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి వస్తుంటుందని వెంకటరామిరెడ్డి తెలిపారని ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఊయలే.. ఉరితాడై