మహానాడుకు సుగవాసి కుటుంబం దూరం
రాయచోటి: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో అడుగులు వేసిన సుగవాసి కుటుంబం, ఆయన అనుచరులు నేడు కడప గడ్డపై జరుగుతున్న మహానాడు వేదికకు దూరమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అధిష్టానమే సుగవాసి కుటుంబాన్ని దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బుధవారం దివంగత నేత ఎన్టీ రామారావు జయంతిని రాయచోటిలోని సుగవాసి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహానాడులో సుగవాసి కుటుంబాన్ని పట్టించుకోలేదన్న ఆవేశం, ఆక్రోశం ఆయన వర్గీయుల్లో కట్టలు తెంచుకుంటుంది. సుగవాసి పాలకొండ్రాయుడు తనయులకు ప్రాధాన్యం లేకపోవడంతో బాల సుబ్రమణ్యం, ప్రసాద్ బాబులు మహానాడుకు దూరమయ్యారని తెలిసింది. వారి అనుయాయులు కూడా మహానాడు కార్యక్రమానికి వెళ్లలేదని సమాచారం. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి, టీడీపీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు తన అనుయాయులతో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుగవాసి అనుచరులు పెద్దఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు.
తండ్రి ఆశయ సాధనకోసం..
తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో అందరి అభిప్రాయం మేరకు రాజకీయాలలో అడుగులు వేస్తామన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా పార్టీని, కుటుంబాన్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు.
సుగవాసి భవన్‌లో
ఎన్టీఆర్ జయంతి వేడుకలు


