వివాహేతర సంబంధంతోనే కిశోర్ హత్య
● నలుగురు నిందితులను అరెస్టు చేసిన యర్రగుంట్ల రైల్వే పోలీసులు
● రూ.5 లక్షలకు సుపారి,
రూ.30 వేలు అడ్వాన్స్
యర్రగుంట్ల : తన భార్యతో వి వాహేతర సంబంధం పెట్టుకు న్న పైడిపాలెం వెంకట కిశోర్ (34)ను ఎన్నిసార్లు మందలించినా మారకపోవడంతో పాటు తన భార్య వద్ద నుంచి బంగారు నగలు, డబ్బులు తీ సుకుని తనను ఆర్థికంగా, సామాజికంగా చితికి పో యేట్లు చేసినందున నరసింహులు అనే వ్యక్తి అతడిని పథకం ప్రకారం హత్యచేయించాడని యర్రగుంట్ల రై ల్వే సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. తొండూరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పైడిపాలెం వెంకటకిశోర్ అదే గ్రామానికి చెందిన నరసింహులు భార్యతో వివా హేతర సంబంధం పెట్టుకున్నాడు. నరసింహులు గ్యా స్ డీలర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పైడిపా లెం వెంకట కిశోర్ ఆరేళ్లుగా నరసింహులు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని నరసింహులు తన భార్యను వెంకటకిశోర్‌ను ఇద్దరినీ మందలించాడు. అయినా వారి తీరు మా రలేదు. వెంకటకిశోర్‌కు పెళ్లి అయినా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. నరసింహులు, అతడి బా వ కిరణ్‌కుమార్‌లు ఇద్దరు కలసి వెంకటకిశోర్‌ను కొట్టి గట్టిగా హెచ్చరించారు. అయినప్పటికి నరసింహులు భార్య ఇంటిలోని డబ్బును, బంగారు నగలున్నింటినీ వెంకటకిశోర్‌కు ఇచ్చి సంబంధం కొనసాగించింది. దీంతో నరసింహులు ఆర్థికంగా, సామాజికంగా తీవ్రక్షోభకు గురయ్యాడు. ఈ సమస్యను పరిష్కరించాలంటే వెంకటకిశోర్‌ను హత్య చేయడమే మార్గమని భా వించి కిరణ్‌కుమార్‌తో చర్చించాడు. కిరణ్‌కుమార్ త న మేనల్లుడు అయిన కార్తిక్‌తో ఈ విషయంపై చర్చించాడు. ఆ తరువాత కార్తిక్ తన స్నేహితుడైన క్రాంతికుమార్‌కు వెంకటకిశోర్‌తో సన్నిహిత పరిచయం ఉందని తెలుసుకొని అతడి ద్వారా వెంకటకిశోర్‌ను హత్య చేయవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జూలై 1వ తేదీన నరసింహులు, కిరణ్‌కుమార్, పులివెందు లలోని జేఎన్టీయూ కళాశాల సమీపంలో కార్తిక్, క్రాంతికుమార్‌లతో చర్చించి రూ.5 లక్షలు సుపారి కుదుక్చు కొని రూ.30 వేలు అడ్వాన్స్‌గా కార్తీక్‌కు చెల్లించారు.
జూలై 25వ తేదీన వెంకటకిశోర్ తన సన్నితుడైన క్రాంతికుమార్‌కు ఫోన్ చేసి తన భార్యతో ఓ పంచాయతి మాట్లాడటానికి దొమ్మర నంద్యాలకు వెళదామని చెప్పాడు. ఇదే అదునుగా భావించి క్రాంతికుమార్, కార్తిక్‌లు ఇద్దరు వెంకటకిశోర్‌ను పులివెందల మీదుగా బైక్ ఎక్కించుకొని ముద్దనూరుకు వచ్చి అక్కడ మద్యం కొనుగోలు చేసి చెన్నరెడ్డిగారిపల్లి గ్రామ సమీపాన రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కూర్చొని మద్యం తాగారు. వెంకటకిశోర్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత క్రాంతికుమార్, కార్తిక్‌లు ఇద్దరు కలసి వెంకటకిశోర్‌ను గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై ఉంచి తలపై రాయితో కొట్టి, ఈ సంఘటనను రైల్వే ప్రమాదంగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని యర్రగుంట్ల రైల్వే పోలీస్‌స్టేషన్ బయట ఉంచారు. ఫలితంగా వెంకటకిశోర్ బంధువులు గుర్తించారు. దీంతో విచారణను యర్రగుంట్ల రైల్వే పోలీసులు లోతుగా చేపట్టారు. పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుసుకొని ముద్దాయిలు నరసింహులు, కిరణ్‌కుమార్, కార్తిక్, క్రాంతికుమార్ తొండూరు వీఆర్‌ఓ వద్ద లొంగిపోయారు.
వివాహేతర సంబంధంతోనే కిశోర్ హత్య


