టైపిస్ట్‌ ప్రశాంత్‌నాయక్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

టైపిస్ట్‌ ప్రశాంత్‌నాయక్‌ అరెస్ట్‌

Dec 27 2025 7:44 AM | Updated on Dec 27 2025 7:44 AM

టైపిస

టైపిస్ట్‌ ప్రశాంత్‌నాయక్‌ అరెస్ట్‌

భూవివాదంలో దాడులు

– అక్రమ చర్యలకు పాల్పడితే కఠినచర్యలు

తప్పవన్న జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

రాయచోటి : సుండుపల్లె మండల తహసీల్దార్‌ కార్యాలయంలో డిజిటల్‌ కీ దుర్వినియోగం చేసి అక్రమంగా పొసెషన్‌ సర్టిఫికెట్లను జారీ చేసిన టైపిస్టు ప్రశాంత్‌నాయక్‌ను సుండుపల్లె పోలీసులు శుక్రవారం రాయచోటిలో అరెస్టు చేవారు. డిజిటల్‌ కీ దుర్వినియోగానికి పాల్పడిన టైపిస్ట్‌ ప్రశాంత్‌నాయక్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్‌ఐ ఎస్‌కె హుస్సేన్‌ పేర్కొన్నారు. అందుబాటులో లేకుండా పారిపోయిన టైపిస్టును శుక్రవారం రాయచోటిలో అరెస్టు చేశామన్నారు. టైపిస్టును శనివారం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఐ పేర్కొన్నారు. అక్రమ చర్యలకు పాల్పడితే కఠినచర్యలు: శాఖాపరంగా అక్రమ అవినీతి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. సుండుపల్లె తహసీల్దార్‌ కార్యాలయంలో డిజిటల్‌కీ దుర్వినియోగానికి పాల్పడిన టైపిస్టు ప్రశాంత్‌నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కలెక్టర్‌ శుక్రవారం స్పందించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

గడ్డి మందు తాగి

యువకుడు మృతి

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని పార్నపల్లి రోడ్డు సమీపంలోని రాజారెడ్డి కాలనీలో నివాసంముంటున్న సాగర్‌ (19)అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాగర్‌ తల్లిదండ్రులు అతడి చిన్నప్పుడే మృతి చెందారు. అమ్మమ్మ కాంతమ్మ ఇంట్లో ఉంటూ బేల్దారి పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సాగర్‌ అయ్యప్పమాల ధరించి మండల దీక్ష పూర్తి చేసుకుని మూడు రోజుల క్రితమే పులివెందులకు వచ్చాడు. మాలలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారం సంబంధించి సాగర్‌ను గంగిరెడ్డి అనే వ్యక్తి బెదిరించాడు. దీంతో మనస్థాపం చెంది గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బంధువులు యువకుడిని చికిత్స కోసం పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అర్బన్‌ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు.

రైల్వేకోడూరు అర్బన్‌ : రైల్వేకోడూరు పట్టణం లక్ష్మీనగర్‌ పట్టా భూములకు సంబంధించి జరిగిన ఇరువర్గాల దాడులలో శుక్రవారం పది మందికి గాయాలయ్యాయి. లక్ష్మీనగర్‌లోని సర్వే నంబర్‌ 7–3, 7–5, 7–4, 13–1ఏ పట్టాభూమిని దశాబ్దాల క్రితం100 మందికిపైగా అన్ని వర్గాల పేదలు కొనుగోలు చేసారు. అయితే కోడూరు అరుంధతివాడకు చెందిన వారు కొద్ది రోజులుగా ఈ భూమి తమదేనంటూ గొడవలు పడుతున్నారు. తహసీల్దార్‌ అమర్‌నాథ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివాద స్థలాన్ని పరిశీలించి భూములు కొన్నవారే హక్కుదారులని నిర్ధారించారు. ఇటీవలే పోలీసుల సహకారంతో జేసీబీలతో చదును చేయించి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డు వేసేందుకు యంత్రాలు పని చేస్తుండగా పోలీసుల సమక్షంలో అరుందతివాడ గ్రామస్తులు అడ్డుకొన్నారు. దీంతో ఇంటి స్థలాలు కొన్న వర్గాలకు, అరుంధతివాడ గ్రామస్తులకు మధ్య గొడవ జరిగి రాళ్లు, కట్టెలతో కొట్టుకొన్నారు. ఈ గొడవలలో అరుంధతి వాడకు చెందిన వారు రాళ్లు రువ్వారు, కర్రలతో దాడులు చేసారు. ఈ క్రమంలో ఇంటి స్థలాలకు చెందిన సుబ్బారెడ్డి, శాంతి, సురేంద్రరాజు, నాగరాజు, అనిల్‌కుమార్‌, మహేష్‌, కరీమున్నీసాలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మేరకు ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టైపిస్ట్‌ ప్రశాంత్‌నాయక్‌ అరెస్ట్‌ 1
1/1

టైపిస్ట్‌ ప్రశాంత్‌నాయక్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement