యువకుడిపై కత్తితో దాడి
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరం మాసాపేట ప్రాంతంలో మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడి పై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు కడప టూ టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కడప శంకరాపురానికి చెందిన నల్ల పోగు పవన్ స్నేహితులతో కలిసి గురువారం రాత్రి మాసాపేట సమీపంలో మద్యం సేవించారు. ఈ క్రమంలో పవన్, హర్ష మధ్య మాటామాటా పెరిగింది. పవన్ (24)పై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
కడప కోటిరెడ్డిసర్కిల్ : నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన కడప చిన్న చౌక్ సీఐ ఓబులేసు సూచించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు శుక్రవారం ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఓబులేసు హెచ్చరించారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని
మృతదేహాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివార్లలోని రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మూడు మృతదేహాలు ఉన్నాయని రిమ్స్ అధికారులు తెలిపారు. వారు వివిధ రోజుల్లో చికిత్స కోసం చేరి మృతి చెందారన్నారు. ఆయా మృతదేహాలు మార్చురీలో ఉంచామని, సంబంధీకులు ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలన్నారు.
– మహిళ మృతి
చిన్నమండెం : కడప–బెంగళూరు జాతీయ రహదారిపై కేశాపురం ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం కారును ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. బద్వేల్‌కు చెందిన గణేష్, అతని భార్య ప్రవళిక, ఐదుగురు కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు నుంచి కారులో బద్వేల్‌కు వస్తుండగా కేశాపురం ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్దకు వచ్చేసరికి ప్రకాశం జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వేగంగా ఎదురుగా రావడాన్ని గమనించిన కారు డ్రైవర్ రోడ్డు సైడ్ ఆపి ఉన్నాడు.అయితే వేగంగా వచ్చిన అంబులెన్స్ కారును ఢీకొనడంతో అందులో ఉన్న ప్రవళిక(33) అక్కడికక్కడే మృతిచెందింది. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు.
యువకుడిపై కత్తితో దాడి
యువకుడిపై కత్తితో దాడి
యువకుడిపై కత్తితో దాడి
యువకుడిపై కత్తితో దాడి


