21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కడప సెవెన్‌రోడ్స్: ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, కడప, అన్నమయ్య జిల్లాల అధికారులు హాజరు కావాలని కోరారు.
నేడు తిరంగ యాత్ర ర్యాలీ
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సైనికులకు మద్దతు తెలియజేస్తూ సిటీజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే పేరున శనివారం కడప నగరంలో తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు కడపలోని ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతి చర్యగా.. ఆపరేషన్ సింధూర్ ద్వారా అద్భుతమైన విజయం అందుకున్న తరుణంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేయాలని కోరారు.
పశువైద్య కళాశాలకు
వీసీఐ బృందం
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాలను వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు పరిశీలించింది. వీసీఐ పరిశీలకులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సాహత్పురే కళాశాలలోని వివిధ విభాగాలు, పశుచికిత్సాలయం, పశుగణక్షేత్ర సముదాయాలు, విద్యార్థుల వసతి గృహాలు, క్రీడా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్ డాక్టర్ వి.చెంగల్వరాయులు, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
20న ఉద్యోగమేళా
రాయచోటి టౌన్: రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఏ. సురేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో హెడీఎఫ్‌సీ బ్యాంక్, జప్టో, టాటా ఏఐఏ, ఎస్‌బీఐ కార్‌ుడ్స, పేటీఎం, సూపర్ కె, ఏఐఎఎల్ డిక్స్‌న్,మూత్తూట్ ఫైనాన్స్, నియోలైక్, డాయికిన్, యంగ్ ఇండియా వంటి కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 88977 76368 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
డిప్లొమా కోర్సులకు
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఎస్‌పీకేఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి ఓఎస్‌డీ ఎస్.గిరిధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీలో సంవత్సరం, మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు, నేరుగా రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వెంకటగిరిలో ఎస్‌పీకేఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 52 సీట్లు, తమిళనాడు సేలంలో 12, కర్ణాటకలోని గదక్‌లో 4 సీట్లు మూడు సంవత్సరాల హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ఉన్నాయని వివరించారు.
అర్హతలు: 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. జూలై 1 నాటికి బీసీ, జనరల్ కేటగిరీలకు 15–23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
లేటరల్ ఎంట్రీ: మూడేళ్ల డీహెచ్ టీటీ కోర్సులో ఇంటర్మీడియెట్ ఎంపీసీ, ఒకేషనల్ (టెక్స్‌టైల్స్), ఐటీఐ (రెండేళ్లు) కోర్సులో ఉత్తీర్ణులైన వారు నేరుగా డీహెచ్‌టీటీ రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల కోసం మే, జూన్ మాసాల్లో డబ్లూడబ్లూడబ్లూ.ఐహెచ్‌టీవీజీఆర్.కామ్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలి. చివరి తేదీ జూన్ 1వ తేదీగా అభ్యర్థులు గుర్తించాలి. ఇతర వివరాలకు 08625–295003, 93999 36872, 9866169908, 9010243054 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.


