
కువైట్‌లో వలసపాళెం వాసి మృతి
అట్లూరు : బతుకు దెరువు కోసం వెళ్లి కువైట్‌లో అట్లూరు మండలం వలసపాళెం గ్రామానికి చెందిన కేతవరం గంగాధర్ (35)అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర్ నాలుగేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. ఎనిమిది నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి భార్యా పిల్లలతో గడిపి కువైట్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో గత నెల 24వ తేదీన కువైట్‌లోని కేతాన్ సమీపంలో 55వ నెంబరు రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తెలిసింది. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో అక్కడి అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు పాస్‌పోర్టు ఆధారంగా సోమవారం అట్లూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కార్మికులకు చట్టాలపై
అవగాహన అవసరం
కడప కోటిరెడ్డిసర్కిల్ : పారిశ్రామిక, వలస, అసంఘటిత కార్మికులు తమకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కడప నగరం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కార్మికులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన సహాయం, ఆస్తి వివాదాలు, బాల కార్మికులు, ఉద్యోగి–యజమాని సమస్యలు, ఈ–శ్రమ్ కార్డుల పట్ల అవగాహన, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం వంటి వాటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ న్యాయవాదులు మనోహర్, ప్రవీణ్ కుమా ర్, పారా లీగల్ వలంటీర్ దశరథ రామిరెడ్డితోపాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

కువైట్‌లో వలసపాళెం వాసి మృతి