జాతీయ స్కేటింగ్ పోటీలకు కడప విద్యార్థిని
కడప ఎడ్యుకేషన్ : జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీలకు కడప నగానికి చెందిన కె. జెషికా ఏంజిల్ ఎంపికై ంది. ఏప్రిల్ 16,17 తేదీలలో హైదరాబాదులో నిర్వహించిన కేంద్రీయ విద్యాలయ ఏపీ, తెలంగాణ రీజనల్ జోనల్ స్థాయి పోటీలలో ఈమె పాల్గొని మూడు గోడ్డ్ మెడల్స్ సాధించింది. త్వరలో జగరనున్న జాతీయస్థాయి పోటీలలో ఆమె పాల్గొననుంది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న జెషికా ఏంజెల్‌ను డీఎస్‌డీఏ జగన్నాథరెడ్డి, రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి, కార్యదర్శి ఇజ్రాయిల్, కోచ్ విలియ్‌కేరీ, వ్యాయామ విద్య సంఘం జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి అభినందించారు.


