సమస్యలపై సత్వరమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై సత్వరమే స్పందించాలి

Apr 29 2025 7:11 AM | Updated on Apr 29 2025 7:11 AM

సమస్యలపై సత్వరమే స్పందించాలి

సమస్యలపై సత్వరమే స్పందించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యల పట్ల అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సభా భవనంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

● బీసీ కుల గణన చేపట్టాలని బీసీ యునైటెడ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశు యాదవ్‌, ఏపీ దళితమిత్ర సంఘం అధ్యక్షుడు కై పు రామాంజనేయులు కోరారు. 1931లో కుల గణన నిర్వహించారని, ఇప్పటివరకు చేపట్టకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.

● సర్వే నెంబరు 847/ఎలోని 4.79 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఎండోమెంట్‌ భూమిగా చూపుతున్నారని, దాన్ని సవరించి తనకు న్యాయం చేయాలని కమలాపురం మండలం అప్పాయపల్లెకు చెందని ఎం.మునీర్‌ అహ్మద్‌ కోరారు.

● తనకు ఎలాంటి భూమి, ఆస్తిపాస్తులు లేవని, అయితే ఆన్‌లైన్‌లో తన పేరిట భూమి ఉన్నట్లు చూపుతోందని, ఇందువల్ల తన కుమారుడికి ప్రభుత్వ ఉపకార వేతనం అందకుండా పోయిందని, కనుక ఆన్‌లైన్‌లో తన పేరుతో ఉన్న రికార్డు వివరాలను తొలగించాలని సీకే దిన్నె మండలం మామిళ్లపల్లెకు చెందిన కృష్ణారెడ్డి కోరారు.

● తన ఇంటి స్థలాన్ని ఇతరులు ఆక్రమించి అక్రమంగా గేటు ఏర్పాటు చేశారని, అధికారులు విచారించి న్యాయం చేయాలంటూ కడప ప్రకాశ్‌నగర్‌కు చెందిన టి.నారాయణరెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, వెంకటపతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డీఆర్వో విశ్వేశ్వరనాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement