వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు

Apr 19 2025 5:03 AM | Updated on Apr 19 2025 5:05 AM

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని పెద్దమ్మ చెట్టు వద్ద ఉన్న ట్రాన్స్‌ఫారంపై కోతి పడటంతో శుక్రవారం మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

మైదుకూరు రోడ్డులో..

అలాగే మైదుకూరు రోడ్డులోని ఒక ఇండస్ట్రీ ఆరుబయట కొబ్బరి పీచు, పొట్టు అగ్ని ప్రమాదానికి గురై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. రూ.20వేలు నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక అధికారి రఘునాథ్‌ తెలిపారు.

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక హౌసింగ్‌బోర్డులోని భగత్‌సింగ్‌ కాలనీలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో బ్యాంక్‌ క్యాబిన్‌తో పాటు కంప్యూటర్‌, కౌంటింగ్‌ మిషన్‌, ఫ్యాన్‌, కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. శుక్రవారం సెలవు కావడంతో బ్యాంక్‌ తెరవలేదు. ఈ క్రమంలో రాత్రి బ్యాంక్‌లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది బ్యాంక్‌ వద్దకు చేరుకొని మంటలను ఆర్పారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి రఘునాథ్‌ తెలిపారు. టూ టౌన్‌ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం గురించి అగ్నిమాపక అధికారితో మాట్లాడారు.

బాలిక అదృశ్యం

రాజంపేట : ఎర్రబల్లిలో నివాసం ఉంటున్న సయ్యద్‌ ముస్కార్‌ తార (18) అనే బాలికకు మతిస్థిమితం సరిలేక అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు శుక్రనవారం పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేది రాత్రి నుంచి కనబడుట లేదని, తమ కుమార్తె ఆచూకీ తెలిసిన వారు 9121100573, 9133817996 నెంబర్లకు సమాచారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కారు, స్కూటర్‌ ఢీ

– స్కూటరిస్టు మృతి

రామాపురం : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా శుక్రవారం కారు, స్కూటర్‌ ఢీ కొని పప్పిరెడ్డి ఇరగంరెడ్డి (50) మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా.. మండలంలోని హసనాపురం పంచాయితీ గొల్లపల్లికి చెందిన పప్పిరెడ్డి ఇరగంరెడ్డి రామాపురంకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా పోలీస్‌స్టేషన్‌ సమీపానికి రాగానే కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న కారు స్కూటర్‌ ఢీ కొంది. ఇరగంరెడ్డి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండల పోలీసులు తెలిపారు.

ఇరగంరెడ్డి మృతికి నివాళి

పప్పిరెడ్డి ఇరగంరెడడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సోదరుడు టీడీపీ నేత డాక్టర్‌ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇరగంరెడ్డి మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకంటామన్నారు.

గ్లోబల్‌ ఇండియా ప్రైమ్‌ కబడ్డీ లీగ్‌కు ఎంపిక

రామాపురం : మండలంలోని నల్లగుట్టపల్లె గ్రామం బీసీకాలనీకి చెందిన గంప నాగేంద్ర కుమారుడు గంపరెడ్డిప్రసాద్‌ గ్లోబల్‌ ఇండియా ప్రైమ్‌ కబడ్డీ లీగ్‌కు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన కబడ్డీ సెలక్షన్‌లో గంప రెడ్డిప్రసాద్‌ తనదైన ప్రతిభను కనబరచడంతో ప్రైమ్‌ కబడ్డీ లీగ్‌కు ఎన్నికయ్యాడు. హర్యానా రాష్ట్రంలో ప్రపంచదేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో కబడ్డీ నిర్వహించనున్నారు. గంపరెడ్డిప్రసాద్‌ ఎంపికపై కుటుంబ సభ్యులు, మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.

వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు 1
1/3

వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు

వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు 2
2/3

వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు

వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు 3
3/3

వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement