
కడప ముంగిట!
అరబిక్ వంట..
రంజాన్‌లో అత్తర్ల గుబాళింపులే కాదు రకరకాల వంటలూ ఘుమఘుమలాడిస్తున్నాయి. పసందైన రుచులతో నోరూరిస్తున్నాయి. అల్ ఫహమ్... అల్ మంది..షవర్మ.. హలీం.. ఇలా ఒకటా రెండా అనేక అరబిక్ వంట లు.. కడప ముంగిట వాలిపోయాయి. రుచుల పంటను ఆస్వాదించమని ఆహారప్రియులను ఆహ్వానిస్తున్నాయి. అసలే రంజాన్.. ఆపై కొత్త వంటకాలు తొంగిచూసిన నేపథ్యంలో సాక్షి సండే స్పెషల్.
ఇటీవలి కాలంలో ఎక్కువ ఆదరణ పొందిన వంటకం అల్ ఫహమ్. బొగ్గులపై కాల్చిన కోడి మాంసం కావడంతో రుచి బాగుంటుంది. పైగా నూనెలు.. మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికీ మంచిదన్న కారణంతో ఇప్పుడందరూ ఈ వంటకాన్ని ఇష్టపడుతున్నారు. కాగా కడప నగరానికి చెందిన జమాల్ వలీ దశాబ్దం పైగా అరబ్ దేశాల్లో వంటమాస్టర్‌గా పని చేశారు. ఆ అనుభవంతో కడప వాసులకు తొలిసారిగా 2006లో ఫహమ్‌ను పరిచ యం చేశారు. ప్రస్తుతం ‘మాషా అల్లాహ్’ ఫహం నడుపుతూ 8 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
● రంజాన్ సీజనంతా...రంజైన రుచుల పంట!
● ఆస్వాదిస్తున్న ఆహారప్రియులు
కడప కల్చరల్: రంజాన్... మనిషిని మానవత్వంగల పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు అవకాశాలను అందించే పండుగ. శారీరకంగా, మానసికంగా మనిషిని ఉన్నతుడినిచేసే ఆధ్యాత్మిక వేడుక. ఈ సందర్భంగా మార్కెట్లు, వీధులలో సెంట్లు, అత్తర్ల గుబాళింపులు మనసులను దోచేస్తాయి. ఒక్క సెంట్లు.. అత్తర్లే కాదు.. రంజాన్ అనగానే హలీం.. తదితర పౌష్టికాహారం వంటకాలూ గుర్తుకొస్తాయి. కొన్నేళ్లుగా పలు రకాల అరబిక్ వంటలు కడప ముంగిట వాలిపోయాయి. దాదాపు రెండేళ్లకో సారి ప్రత్యేకమైన అరేబియన్ వంటకం పరిచయం అవుతుండడం విశేషం.
అల్ ఫహమ్...

కడప ముంగిట!