24న గోవిందమాంబ ఆరాధన | - | Sakshi
Sakshi News home page

24న గోవిందమాంబ ఆరాధన

Mar 21 2025 12:59 AM | Updated on Mar 21 2025 12:53 AM

బ్రహ్మంగారిమఠం: భవిష్యత్‌ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన ఈనెల 24న నిర్వహించనున్నట్లు మఠం మేనేజర్‌ ఈశ్వరాచారి తెలిపారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 8గంటలకు అభిషేకం, 10గంటలకు సహస్ర నామార్చన, 1గంటకు ద్వారపూజ, రాత్రికి గ్రామోత్సవం ఉంటుందన్నారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రేపు ప్రొద్దుటూరులో జాబ్‌మేళా

కడప కోటిరెడ్డిసర్కిల్‌: జిల్లా ఉపాధి కార్యాలయం, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై 18–45 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి రూ. 12–25 వేల వరకు హోదాను బట్టి వేతనం ఉంటుందని వివరించారు. ప్రొద్దుటూరు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

హుండీల ఆదాయం లెక్కింపు

బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న కానుకలను గురువారం లెక్కించారు. ఇందులోరూ.20,15,750 నగదు, 1గ్రాము బంగారం, 90గ్రాములు వెండి వచ్చినట్లు మేనేజర్‌ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం పిట్‌పర్సన్‌ శంకర్‌బాలాజీ , పూర్వపు మఠాధిపతి కుమారుడు వెంకటాద్రిస్వామి, ఎండోమెంట్‌ అధికారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సంగమేశ్వరుడి

ఆదాయం రూ.5లక్షలు

వీరపునాయునిపల్లె: మండలంలోని మొగమూరు, పాపాఘ్ని నదుల సంగమం వద్ద వెలసిన సంగమేశ్వరుని ఆలయంలో గురువారం ఆలయ మాజీ చైర్మెన్‌ మురళీ మోహన్‌రెడ్డి, ఈఓ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. లెక్కింపు అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మార్చి నుంచి నేటి వరకు 5లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు తెలియజేశారు. అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయ ఈఓ మారుతీ ప్రసాద్‌, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, వాసుదేవరెడ్డి, ప్రసాదురెడ్డి భక్తులు పాల్గొన్నారు.

శిల్పారామానికి నూతన ఏఓ

కడప కల్చరల్‌: కడప శిల్పరామానికి నూతన పాలనాధికారి (ఏఓ) వచ్చారు. ఇప్పటివరకు ఏఓగా పనిచేస్తున్న పి.శివప్రసాద్‌రెడ్డి అనంతపురం శిల్పారామానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో అనంతపురం శిల్పారామం ఏఓ కృష్ణ ప్రసాద్‌ గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప శిల్పారామంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పులివెందులలో ఇంతవరకు ఏఓగా ఉండిన సుధాకర్‌ను తిరుపతి శిల్పారామానికి బదిలీ చేయగా, అక్కడి ఏఓ ఖాదర్‌వలీని పుట్టపర్తి శిల్పారామానికి బదిలీ చేశారు. విశాఖ ఏఓగా ఉండిన విశ్వనాథ్‌ను పులివెందుల శిల్పారామానికి బదిలీ చేశారు.

24న గోవిందమాంబ ఆరాధన 1
1/3

24న గోవిందమాంబ ఆరాధన

24న గోవిందమాంబ ఆరాధన 2
2/3

24న గోవిందమాంబ ఆరాధన

24న గోవిందమాంబ ఆరాధన 3
3/3

24న గోవిందమాంబ ఆరాధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement