కాశినాయన: మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతిక్షేత్రం కాశినాయన ఆశ్రమానికి గురువారం ఉదయం 8.30 గంటలకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రానున్నట్లు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు హనుమంతరెడ్డి తెలిపారు. అటవీశాఖ అనుమతులు లేవంటూ అటవీ అధికారులు కూల్చివేసిన ఆలయ కట్టడాలను ఆయన పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, జిల్లా నాయకులు వస్తారని, పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
సెమిస్టర్ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ విభాగపు 1, 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం వర్శిటీ వీసీ ఆచార్య జి. విశ్వనాథ కుమార్, రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఫణీంద్ర రెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారులు ఉదయప్రకాష్ రెడ్డి, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుండీ కానుకలు లెక్కింపు
పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీ కానుకలను బుధవారం దేవదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, అక్కదేవతలు, పులిబండెన్న స్వాములవారి హుండీ కానుకలను లెక్కించగా రూ.33,37,829 లక్షలు నగదు, 50 గ్రాములు బంగారు, 4కేజీలు వెండి లభించిదన్నారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ ఈఓ క్రిష్ణానాయక్ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.


