చిన్నమండెం : మండలంలోని కొత్తపల్లె పంచాయతీ మల్లూరు క్రాస్ వద్ద నివాసముండే శివారెడ్డి ఇంటిపై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.
ఆయన కథనం మేరకు.. స్థానిక తాగునీటి కుళాయి వద్ద చిన్నప్ప, శివారెడ్డి గొడవపడ్డారన్నారు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేశారన్నారు. అయినా శివారెడ్డి ఇంటిపై శనివారం చిన్నప్ప అనుచరులు మారణాయుధాలతో దాడికి దిగారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు.